Spiritual9th Jan 12:40 PMSunil Byrisetty1 min read

శివాలయంలో కళ్యాణ ఉత్సవం ఏర్పాటు చేయాలి

ధర్మరాజు ప్రతిష్టించిన బ్రహ్మసూత్రం గల మంగళగిరి శివాలయంలో శివయ్యకు నిత్యకళ్యాణం లేదా గతంలో వలే మాస కళ్యాణం వంటి సేవలకు పునరుద్దరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న సేవ

శివాలయంలో కళ్యాణ ఉత్సవం ఏర్పాటు చేయాలి
ధర్మరాజు ప్రతిష్టించిన బ్రహ్మసూత్రం గల మంగళగిరి శివాలయంలో శివయ్యకు నిత్యకళ్యాణం లేదా గతంలో వలే మాస కళ్యాణం వంటి సేవలకు పునరుద్దరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న సేవలను అప్పటి అధికారులు రద్దుచేశారని తిరిగి వాటిని ఏర్పాటు చేసి అటు భక్తులకు స్వామివారి సేవ చేసుకునే భాగ్యంతో పాటు ఆలయానికి ఆదాయం పెరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. గతంలో గణపతి మందిరం పక్కన ఉన్న మండపంలో స్వామివారి మాస కల్యాణ ఉత్సవాలు జరిగేవని అదే విధంగా ఆరుద్ర నక్షత్రం రోజు స్వామివారికి మాస కళ్యాణ ఉత్సవం పునరుద్దరించాలని భక్తులు కోరుతున్నారు. మంగళగిరి శివాలయంలో అర్చక స్వాముల కొరత ఉన్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. నిజంగా అదే విధంగా అర్చక స్వాముల కొరత ఉంటే ఎండోమెంట్ అధికారుల ద్వారా అదనపు సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ లు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. అదనపు సిబ్బంది ఉంటే స్వామివారికి మరిన్ని సేవలను అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
Andhra Pradesh
Mangalagiri Shiva Temple
Kalyanotsavam
Nitya Kalyanam
Masa Kalyanam
Devotees Demand
Temple Traditions
ఎండోమెంట్ శాఖ
అర్చకుల కొరత
శైవ క్షేత్రాలు
Scroll for the next article