TTD10th Oct 02:07 PMSunil Byrisetty1 min read
శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
జైపూర్ కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు తిరుమల శ్రీవారికి రూ.51.55 లక్షలు విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని విరాళంగా అందించారు. వీటిలో రూ.44.35 లక్షలు విలువైన వజ్ర
జైపూర్ కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు తిరుమల శ్రీవారికి రూ.51.55 లక్షలు విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని విరాళంగా అందించారు. వీటిలో రూ.44.35 లక్షలు విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్, రూ.7.20 లక్షలు విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల మూడు వరుసల ముత్యాల హారాలు ఉన్నాయి. ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ఆభరణాలను అందజేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ కు చెందిన ఎస్ఎస్కే ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొప్రైటర్ జి. శ్రవణ్ కుమార్ రూ.15 లక్షల విలువైన ఔషధాలను, ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ తలశిల వెంకటేశ్వరరావు రూ.3 లక్షల విలువైన ఔషధాలను శనివారం విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్. నాయుడును కలిసి దాతల తరఫున ఔషధాలను అందజేశారు.