Spiritual27th Oct 05:48 PMSunil Byrisetty1 min read

బోర్డులో ఒక రేటు.. భక్తుల నుంచి తీసుకునేది మరో రేటు

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సెల్ ఫోన్ కౌంటర్ వద్ద భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. భక్తులు ప్రశ్నిస్తే అది అంతే అంటూ సిబ్బంది సమాధానమిస్తున్నారు. బ్యాగ్,కెమెరా, సెల్ ఫోన్ లు కు సూచ

బోర్డులో ఒక రేటు.. భక్తుల నుంచి తీసుకునేది మరో రేటు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సెల్ ఫోన్ కౌంటర్ వద్ద భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. భక్తులు ప్రశ్నిస్తే అది అంతే అంటూ సిబ్బంది సమాధానమిస్తున్నారు. బ్యాగ్,కెమెరా, సెల్ ఫోన్ లు కు సూచిక బోర్డులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు నిర్ణయించి బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం భయం లేకుండా డబుల్ రేట్లతో భక్తుల ముక్కు పిండి నిలువున వసూలు చేస్తున్నారు. దేవుడు దర్శనానికి వచ్చాం వాళ్లతో గొడవలు ఎందుకని అడిగింది ఇచ్చి కొంతమంది భక్తులు వెళ్లిపోతున్నారు. వారిని ఎవరైనా ఎదురుగా బోర్డులో ఇంత రేటు వేశారు. మీరు తీసుకునేది ఎక్కువగా తీసుకుంటున్నారు స్లిప్పుల్లో కూడా ఆ రేట్ లేదని ప్రశ్నిస్తే వారి వద్ద తక్కువ తీసుకుంటున్నారు. భక్తులు ఎంత మోసపోతున్నా అధికారులకు ఏమి పట్టనట్లు వ్యవహరించడం పై సర్వత్ర విమర్శలు ఉన్నాయి.ముక్కంటిశ్వరుడే చూసుకోవాలని భక్తులు వాపోతున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోందని, భక్తులు కూడా శివాలయానికి అధికంగా విచ్చేస్తున్నారు. భక్తులను కౌంటర్లో నిలువు దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
Srikalahasti Temple
Devotees
Overcharging
Temple Management
Corruption
Cell Phone Counter
Tirupati Temples
Karthika Masam
కార్తీక మాసం
శివాలయం
ఆంధ్రప్రదేశ్‌
భక్తుల ఫిర్యాదులు
Scroll for the next article