Spiritual19th Nov 02:26 PMSunil Byrisetty1 min read
అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం!
శబరిమల అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు ఉన్నారు. అయ్యప్ప స
శబరిమల అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శబరిమలలో 2 లక్షలకు పైగా భక్తులు ఉన్నారు.
అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్వాములు ఎదురు చూస్తున్నారు. కిలోమీటర్ల మేర భక్తులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
ఆన్‌లైన్ స్లాట్‌లో అధికారులు 70 వేల టికెట్లు ఇచ్చారు. ఆఫ్‌లైన్‌లో మరో పాతిక వేల మందికి అవకాశం కల్పించారు. రెండు లక్షల మందికి పైగా ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామి దర్శనార్థం ఎదురుచూపులు చూస్తున్నారు. తాగడానికి కనీసం నీళ్లు, తినడానికి ఆహారం లేకుండా గంటల తరబడి క్యూలైన్లో ఉండడంతో అయ్యప్పలు సొమ్మసిల్లి పడిపోతున్నారు. క్యూలైన్‌ల వద్ద ఎక్కడ కూడా ఆలయ సిబ్బంది, పోలీసులు కనిపించడం లేదు. ఎక్కడ తోపులాట జరుగుతుందేమో అని భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.