Spiritual10th Aug 01:33 PMSunil Byrisetty1 min read

అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పణకు రండి

ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆగస్టు 12తో ముగియనున్న ఆషాఢ సారె సమర్పణలు చేసే భక్తులు ఈ చివరి 2 రోజులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పణకు రండి
ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆగస్టు 12తో ముగియనున్న ఆషాఢ సారె సమర్పణలు చేసే భక్తులు ఈ చివరి 2 రోజులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించాలనుకునే భక్తులకు ఇక చివరి 2 రోజులు మాత్రమే సమయం ఉందని తెలిపారు. సారె సమర్పించే భక్తులు ముందుగా కనకదుర్గ నగర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. సారె తీసుకువచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు రూ. 100 భవానీ అనుగ్రహ దర్శన క్యూ లైన్ ను ప్రత్యేకంగా కేటాయించారు. అమ్మవారికి ఆలయ మర్యాదలతో సారె సమర్పించిన అనంతరం, భక్తులకు మహా మండపం ఆరో అంతస్తులో సారే సమర్పణ ఆశీర్వచనం జరుగుతుంది.
Andhra Pradesh
Kanaka Durga Temple
Indrakeeladri
Ashada Masam
Ashada Sare
Vijayawada
Devotees
Goddess Durga
దుర్గమ్మ అమ్మవారు
ఆలయ వార్తలు
భక్తి వార్తలు
ఆధ్యాత్మిక సంప్రదాయాలు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article