Spiritual27th Jul 05:07 PMSunil Byrisetty1 min read
శ్రీ సత్తెమ్మ, అంకమ్మ తల్లులకు సారె
యర్రబాలెం శ్రీ సత్తెమ్మ తల్లి, అంకమ్మ తల్లి దేవర గుడిలో శ్రావణ మాసాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం పురస్కరించుకొని గ్రామ దానబోయిన వారి దేవర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవార్లక
యర్రబాలెం శ్రీ సత్తెమ్మ తల్లి, అంకమ్మ తల్లి దేవర గుడిలో శ్రావణ మాసాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం పురస్కరించుకొని గ్రామ దానబోయిన వారి దేవర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవార్లకు దానబోయిన వారి ఆడపడుచులు అమ్మవార్లకు సారె సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామంలో పసుపు, కుంకుమ, సారె చేతబట్టుకొని బొల్లె ఆవులతో ఊరేగింపు నిర్వహించారు. వీర తాళ్ల ప్రదర్శనతో మేళతాళాలు, కనక తప్పెట్ల భక్తుల కోలాహలం మధ్య ఊరేగింపు ఘనంగా సాగింది. గ్రామంలో ఆయా కూడలి ప్రాంతాలలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి సారెకు నీరు వార పోశారు. అనంతరం ఆడపడుచుల సారె ఊరేగింపు ఆలయం వరకు చేరుకొని, మహిళలు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారె సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దానబోయిన వారి దేవర కమిటీ ప్రతినిధులు, పెద్దలు, యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.