Spiritual26th Jul 11:39 AMSunil Byrisetty1 min read

ఆశాడా సారె, ఆదివారం.. రద్దీ ఫుల్!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం కిటకిటలాడుతోంది. ఒక వైపు ఆషాఢ సారె సమర్పణ బృందాలు ఇంకో వైపు ఆదివారం సెలవు సందర్బంగా భక్తుల రద్దీతో దుర్గమ్

ఆశాడా సారె, ఆదివారం.. రద్దీ ఫుల్!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం కిటకిటలాడుతోంది. ఒక వైపు ఆషాఢ సారె సమర్పణ బృందాలు ఇంకో వైపు ఆదివారం సెలవు సందర్బంగా భక్తుల రద్దీతో దుర్గమ్మ సన్నిధి సందడిగా మారింది. తెలంగాణ బోనాలు సమర్పణ సందర్బంగా హైదరాబాద్ నుండి తరలి వచ్చిన భక్త బృందాలు దర్శనానికి తరలాయి. దీంతో ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ పెరిగింది. ప్రోటోకాల్ దర్శనాలు రద్దయ్యాయి. సారె సమర్పణ బృందాలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. రద్దీ నియంత్రణ చర్యలను ఈవో శీనా నాయక్ పర్యవేక్షణ చేస్తున్నారు. దేవస్థానం - పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్, క్యూ లైన్ మేనేజ్మెంట్ ఏర్పాట్లు, నగర DCP జి. రామకృష్ణ, ACP దుర్గారావు, వన్ టౌన్ CI గుణ రామ్ ఆధ్వర్యంలో ఈవో శీనా నాయక్ పర్యవేక్షణ లో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Andhra Pradesh
Kanaka Durga Temple
Indrakeeladri
Vijayawada
Ashada Sare
Ashada Festival
Sunday Rush
Devotees
Bonalu
ఈవో శీనా నాయక్
ట్రాఫిక్ నిర్వహణ
క్యూ లైన్ నిర్వహణ
Scroll for the next article