Spiritual28th Sep 11:06 AMSunil Byrisetty1 min read
అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం
ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఏడో రోజు శ్రీ మహా చండీ దేవి అవతారంలో దుర్గామాత ఆదివారం భక్తులకు దర్శనమిస్తున్నారు. సాధారణంగానే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండ
ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఏడో రోజు శ్రీ మహా చండీ దేవి అవతారంలో దుర్గామాత ఆదివారం భక్తులకు దర్శనమిస్తున్నారు. సాధారణంగానే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే నవరాత్రి ఉత్సవాలు నేడు ఆదివారం కావడంతో ఉదయం 3 గంటల నుంచి భక్తజన సందోహం తాకిడి పెరిగింది. ఈరోజు భక్తజన సందోహం ఎక్కువగా ఉంటుందని ఊహించిన ఆలయ అధికారులు సమన్వయం చేసుకోవడంతో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు సాధారణ భక్తులకు అవసరమైన వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేయడం విశేషం. సోమవారం మూలా నక్షత్రం కావడంతో దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకు సన్నద్ధమయ్యారు.