News11th Jan 04:39 PMSunil Byrisetty1 min read

మేడారానికి పోటెత్తిన భక్తజనం.. సెలవులతో రద్దీ!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా తరలివ

మేడారానికి పోటెత్తిన భక్తజనం.. సెలవులతో రద్దీ!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో మేడారంలోని గద్దెల ప్రాంగణం, జంపన్న వాగు పరిసరాలు జనసందోహంగా మారాయి. జనవరి 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనున్న నేపథ్యంలో.. అప్పటి రద్దీని దృష్టిలో ఉంచుకుని చాలామంది భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొనడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.
Telangana
Medaram Jatara
Sammakka Saralamma
Devotees Rush
Sankranti Holidays
Tribal Festival
Jampanna Vagu
గద్దెల ప్రాంగణం
ముందస్తు మొక్కులు
ఆధ్యాత్మిక వాతావరణం
Scroll for the next article