Spiritual5th Nov 09:43 AMSunil Byrisetty1 min read

ఆలయాలు, నదులకు కార్తీక శోభ!

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొ

ఆలయాలు, నదులకు కార్తీక శోభ!
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి, అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేస్తూ పుణ్యం సంపాదించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నదీ పరివాహక ప్రాంతాల్లో, కృష్ణానదీ పుష్కరఘాట్ భక్తుల రద్దీ అధికంగా ఉంది. భక్తులు నదిలో పుణ్య స్నానాలాచరించి కార్తీకదీపాలు వెలిగించి నదిలోకి వదులారు. అనంతరం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Andhra Pradesh
Karthika Pournami
Telugu States
Temples
Rivers
Devotion
Deepaaradhana
Shiva Temples
పుణ్యస్నానం
కృష్ణానది
హిందూ పండుగ
దానధర్మం
ఆధ్యాత్మికత
Scroll for the next article