News24th Oct 12:58 PMSunil Byrisetty1 min read

విమానాల్లో పవర్ బ్యాంకులకు నో!?

పవర్ బ్యాంకుల వినియోగం వల్ల ప్రమాదం తలెత్తే విషయంపై విమానయాన శాఖ పరిశీలిస్తోంది. డొమిస్టిక్ విమానాల్లో పవర్ బ్యాంకులను నిషేధించే విషయాన్ని DGCA పరిశీలిస్తోంది. ఇటీవల ఇండిగో విమానంల

విమానాల్లో పవర్ బ్యాంకులకు నో!?
పవర్ బ్యాంకుల వినియోగం వల్ల ప్రమాదం తలెత్తే విషయంపై విమానయాన శాఖ పరిశీలిస్తోంది. డొమిస్టిక్ విమానాల్లో పవర్ బ్యాంకులను నిషేధించే విషయాన్ని DGCA పరిశీలిస్తోంది. ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు నుంచి మంటలు చెలరేగగా సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో వాటిని నిషేధించడం లేక తక్కువ సామర్థ్యం ఉన్నవాటిని అనుమతించడంపై పరిశీలన చేస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశముంది. అటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో పవర్ బ్యాంకుల వినియోగంపై నిషేధం ఉంది.
India News
DGCA
Power Bank Ban
Indigo Flight
Aviation Safety
Air Travel
Flight Safety
DGCA India
Travel Alert
Battery Safety
విమానయాన శాఖ
ప్రయాణికుల భద్రత
బ్యాటరీ పేలుడు
ఎయిర్ ట్రావెల్
ట్రావెల్ అలర్ట్
ఎలక్ట్రానిక్ పరికరాలు
Scroll for the next article