News30th Jun 10:51 AMSunil Byrisetty1 min read
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో DGP హరీష్ కుమార్ గుప్తా
మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన DGP హరీష్ కు
మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన DGP హరీష్ కుమార్ గుప్తా గారికి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా హరీష్ కుమార్ గుప్తా నాగ పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు దేవస్థానం ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు గారు DGPకి పట్టు వస్త్రాలతోపాటు శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.