News23rd Sep 05:20 PMSunil Byrisetty1 min read
విజయవాడలో ధన్వంతరి హోమం నిర్వహణ
11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ డా.ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మరియు ఆయుర్వేద వైద్య వ
11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ డా.ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మరియు ఆయుర్వేద వైద్య విధాన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ శ్రీ ధన్వంతరి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయుష్ శాఖ డైరెక్టర్ గోపాలకృష్ణ రొణంకి, అదనపు డైరెక్టర్ డా.పి.సాయి సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ జె.ధనుంజయరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన యూజి విద్యార్థులు, పిజి స్కాలర్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. అలాగే జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలు, కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, బహుమతులు అందజేశారు. ఈ వేడుకలు ఆయుర్వేద విద్య, పరిశోధన, వైద్య సేవలు మరియు ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన పెంపొందించడంలో డా. ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల యొక్క నిబద్ధతను ప్రతిబింబించాయి.