Entertainment7th Jul 12:28 PMSunil Byrisetty1 min read
ఘనంగా ధోనీ పుట్టినరోజు వేడుకలు
ఎంఎస్ ధోనీ పుట్టినరోజు క్రికెట్ అభిమానులకు పండుగగా మారింది. మహీ స్వరాష్ట్రమైన జార్ఖండ్‌తోపాటు దేశవిదేశాల్లో అభిమానులు వేడుకగా జరుపుకొంటున్నారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన 44వ
ఎంఎస్ ధోనీ పుట్టినరోజు క్రికెట్ అభిమానులకు పండుగగా మారింది. మహీ స్వరాష్ట్రమైన జార్ఖండ్‌తోపాటు దేశవిదేశాల్లో అభిమానులు వేడుకగా జరుపుకొంటున్నారు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన 44వ పుట్టినరోజును స్వస్థలమైన రాంచీలో జరుపుకున్నారు. సన్నిహితుల మధ్య కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్లీవ్‌లెస్ టీ-షర్ట్ ధరించిన ధోనీ, స్నేహితులతో కేక్ ముక్కలను పంచుకున్నారు. మరోవైపు మిస్టర్ కూల్ ధోనీ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలో, అభిమానులు ధోనీకి ఎత్తైన కటౌట్‌తో నివాళులర్పించారు.