Health19th Apr 09:13 AMSunil Byrisetty1 min read

షుగర్‌ తగ్గాలా? వాకింగ్ చేయండి!

చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇప్పుడు ఎవరికైనా వచ్చేస్తోంది డయాబెటిస్‌. ఒకసారి షుగర్ వచ్చిందంటే ఇక మందులు నిత్యం వాడాల్సిందే. అసలు షుగర్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే నడవాలంట. డయాబెటి

షుగర్‌ తగ్గాలా? వాకింగ్ చేయండి!
చిన్నా, పెద్దా తేడా లేకుండా ఇప్పుడు ఎవరికైనా వచ్చేస్తోంది డయాబెటిస్‌. ఒకసారి షుగర్ వచ్చిందంటే ఇక మందులు నిత్యం వాడాల్సిందే. అసలు షుగర్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే నడవాలంట. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో నడక కీలక పాత్ర పోషిస్తుందని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో 5 లక్షలకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. ఆ డేటాను విశ్లేషించినప్పుడు.. టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడానికి నడక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. గంటకు 4 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో నడిచే వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువంటున్నారు. అదే 5-6 కిలోమీటర్ల వేగంతో నడవడం వల్ల ప్రమాదాన్ని 24% వరకు తగ్గిస్తుంది. గంటకు 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నడవడం వల్ల ప్రమాదం దాదాపు 39% తగ్గిస్తుందని చెబుతున్నారు. వేగంగా నడవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. కండరాలలో గ్లూకోజ్ శోషణను పెంచుతుంది. ఫలితంగా, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి, డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
Precautions For Diabetic Patients
walk after eating
blood sugar control
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌
నడక కీలక పాత్ర
Scroll for the next article