Politics27th Mar 05:43 PMSunil Byrisetty1 min read
తెలంగాణలో చిత్రం.. కాంగ్రెస్ మంత్రిని పొగిడిన కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రతిదానికి ప్రభుత్వం రాష్ట్రం అప్పుల పాలైందనడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రతిదానికి ప్రభుత్వం రాష్ట్రం అప్పుల పాలైందనడం సరికాదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు సగటు ఆదాయం రూ. 3500 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.18 వేల కోట్లు ఉందన్నారు.
అప్పులకు రెట్టింపు సంపద పెరిగిందని తెలియజేశారు.
అమెరికా లాంటి దేశాలకు కూడా అప్పులు ఉంటాయని, అప్పులు లేని దేశం గాని రాష్ట్రం గాని ఉండవన్నారు.
ఆ మాటకొస్తే అప్పులు లేని మనిషి కూడా ఉండరన్నారు.
అసెంబ్లీలో సభ్యులందరికీ కూడా అప్పులు ఉన్నాయన్నారు.
అప్పులు లేని వాళ్ళు ఈ సభలో ఎవరైనా ఉన్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.
దానికి కాంగ్రెస్ మంత్రి భట్టి విక్రమార్క "నాకు లేవు" అని జవాబిచ్చారు.
అందుకు కేటీఆర్ "మీరు గ్రేట్ భట్టి అన్న, రాష్ట్రానికి ఆర్థికమంత్రి కదా అలాగే ఉండాలి.." అనడంతో సభలో కొద్దిసేపు నవ్వులు విరిసాయి.