News11th Sep 12:46 PMSunil Byrisetty1 min read

విజయవాడలో డయేరియా కలకలం

విజయవాడలో న్యూరాజరాజేశ్వరిపేటలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. చవితి భోజనాల్లో ఫుడ్‌పాయిజన్ అయుండొచ్చని అధికారులు అంటున్నారు. స్థానికులు మాత్రం మంచినీరు కలుషితమైందని చెబుతున్నారు. ద

విజయవాడలో డయేరియా కలకలం
విజయవాడలో న్యూరాజరాజేశ్వరిపేటలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. చవితి భోజనాల్లో ఫుడ్‌పాయిజన్ అయుండొచ్చని అధికారులు అంటున్నారు. స్థానికులు మాత్రం మంచినీరు కలుషితమైందని చెబుతున్నారు. దీంతో ఇంటింటి సర్వే ద్వారా నీటి శాంపిల్స్‌ సేకరించారు. అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమ పరామర్శించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాలను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగితెలుసుకున్నారు. 22 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, 41 మందికి చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ లక్ష్మీశ వివరించారు. 91549 70454 నంబర్లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Andhra Pradesh
Vijayawada
Neerajarajeswaripeta
Food Poisoning
Contaminated Water
Diarrhea Outbreak
Medical Treatment
Minister Narayana
ఎమ్మెల్యే బోండా ఉమ
కలెక్టర్ లక్ష్మీశ
కంట్రోల్ రూమ్
Scroll for the next article