News30th Aug 11:41 AMSunil Byrisetty1 min read

స్వర్ణాంధ్రలో ప్రవాసాంధ్ర భాగస్వామ్యం

స్వర్ణాంధ్ర-2047 నిర్మాణంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాల‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. మ‌లేషియాలోని TAM 70వ ప్లాటినం జూబ్లి వేడుకల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌

స్వర్ణాంధ్రలో ప్రవాసాంధ్ర భాగస్వామ్యం
స్వర్ణాంధ్ర-2047 నిర్మాణంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాల‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. మ‌లేషియాలోని TAM 70వ ప్లాటినం జూబ్లి వేడుకల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మలేసియాలోని పెనాంగ్ వాటర్‌ఫ్రంట్ కన్వెన్షన్ సెంటర్‌లో జ‌రిగిన వేడుక‌ల్లో మంత్రి మాట్లాడుతూ 1955లో చిన్న విత్త‌నంలా ప్రారంభ‌మైన మ‌లేషియా తెలుగు సంఘం నేడు 5 ల‌క్ష‌ల మంది తెలుగు ప్ర‌జ‌ల‌కు అండ‌గా.. ఒక మ‌హావృక్షంలా నిల‌బ‌డ‌డం ప్ర‌శంస‌నీయం అని కొనియాడారు. ఈ 70 ఏళ్ల ఈ ప్రస్థానం ఏడు తరాల కృషికి, తెలుగు బంధానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. APNRTS ద్వారా రూ. 10 లక్షల ఉచిత ప్రమాద బీమా (PBB), 24/7 హెల్ప్‌లైన్, NRI సెల్ మరియు పెట్టుబడుల కోసం 'వన్-స్టాప్ సేవలు' అందిస్తున్నామని వివరించారు. మలేసియాలో సాధించిన వ్యాపార నైపుణ్యాలను, అనుభవాన్ని మన ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువ‌చ్చి ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టాల‌ని.. ఇక్క‌డ ప్ర‌భుత్వం మీకు అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.
Andhra Pradesh
NRI Telugu Community
Swarna Andhra 2047
Telugu Diaspora
Malaysia Telugu Association
TAM
Kondapalli Srinivas
APNRTS
తెలుగు సంఘం
మలేషియా
ఎన్నారై వ్యవహారాలు
పెట్టుబడి అవకాశాలు
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article