News23rd Jul 04:34 PMSunil Byrisetty1 min read
పెళ్లి చేసుకుంటే పన్ను కట్టాలా?
వివాహం చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ పన్ను కట్టాలని మీకు తెలుసా? అయితే అది ఇప్పుడు కాదు, కొన్ని వందల ఏళ్ల క్రితం అలా పన్ను చెల్లించాల్సి ఉండేదట. రాజుల కాలంలో వివాహాలపై పన
వివాహం చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కానీ పన్ను కట్టాలని మీకు తెలుసా? అయితే అది ఇప్పుడు కాదు, కొన్ని వందల ఏళ్ల క్రితం అలా పన్ను చెల్లించాల్సి ఉండేదట. రాజుల కాలంలో వివాహాలపై పన్నులుండేవంటే నమ్మగలమా? కానీ అది నిజం. ఈ పన్నులు భరించలేక కొంత మంది పెళ్లి కూడా చేసుకునేవారు కాదు. విజయనగర రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల పాలనకు ముందు వరకు ఇలాంటి సుంకాలు ఉండేవి. కానీ ఆయన వచ్చిన తర్వాత కనిగిరి, గుత్తి, కందనవోలు, గండికోట, సిద్ధవటం, చంద్రగిరి, నాగమంగళం, రాయదుర్గం ప్రాంతాల్లో వధూవరులు చెల్లించాల్సిన పెళ్లి సుంకాన్ని రద్దు చేసినట్లు క్రీ.శ.1510 నాటి ఈ శాసనం చెబుతోందని పరిశోధకుడు అవధానం ఉమామహేశ్వరశాస్త్రి తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని పురాతన ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ శాసనం ఉంది.