News24th Jul 10:41 AMSunil Byrisetty1 min read
‘తల్లికి వందనం’ పడలేదా? టెన్షన్ వద్దు..
కూటమి ప్రభుత్వం బడికెళ్లే పిల్లల తల్లులకు అందిస్తున్న తల్లికి వందనం గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్నా పలు కారణాలతో డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరో
కూటమి ప్రభుత్వం బడికెళ్లే పిల్లల తల్లులకు అందిస్తున్న తల్లికి వందనం గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్నా పలు కారణాలతో డబ్బులు రాని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. గతేడాది లబ్ధి పొంది, తాజాగా అనర్హుల జాబితాలో చేరడం/ఇతర సమస్యలతో పథకం వర్తించని వారు 10 రోజుల్లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయొచ్చు. వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా గ్రీవెన్స్ మాడ్యూల్లో రిక్వెస్ట్ పెట్టాలి. విద్యుత్ బిల్లులు సహా ఇతర లోపాలతో లబ్ధిపొందనివారు అప్లై చేయొచ్చు. తద్వారా అర్హులైతే తల్లికి వందనం లబ్ధి పొందవచ్చు.