News17th Jul 02:59 PMSunil Byrisetty1 min read

శ్రీకాకుళం టూ తిరుపతి ట్రై సైకిల్ యాత్ర

దివ్యాంగుడైన టీడీపీ కార్యకర్త ప్రసాద్ శ్రీకాకుళం టూ తిరుమల తిరుపతి ట్రై సైకిల్ యాత్ర చేపట్టారు. విషయం తెలిసి, అతడిని కలిసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ చలించిపోయారు. గత

శ్రీకాకుళం టూ తిరుపతి ట్రై సైకిల్ యాత్ర
దివ్యాంగుడైన టీడీపీ కార్యకర్త ప్రసాద్ శ్రీకాకుళం టూ తిరుమల తిరుపతి ట్రై సైకిల్ యాత్ర చేపట్టారు. విషయం తెలిసి, అతడిని కలిసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ చలించిపోయారు. గత ఎన్నికల్లో నారా చంద్రబాబు సీ ఏం కావాలని మొక్కును తీర్చుకుంటున్న దివ్యాంగ యువకుడి సాహస యాత్రకు అండగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం, ఊరగం గ్రామ నివాసి మెయిల ప్రసాద్ అనే దివ్యాంగుడు చంద్రబాబు కోసం ట్రై సైకిల్ పై తిరుమల యాత్ర చేస్తున్నట్లు తెలుసుకున్నారు. నసీర్ మాట్లాడుతూ తొలినుంచి టీడీపీ పార్టీ అభిమానిగా వుండే ప్రసాద్ దివ్యాంగుడైనా మంచి మనసుతో రాష్ట్ర శ్రేయస్సు కోరి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే తపన చూస్తే టీడీపీ అంటే ఎంత ఇష్టమో అర్ధం చేసుకోవచ్చన్నారు. ప్రసాద్ మాట్లాడుతూ ఊరగం గ్రామం నుంచి 640 కిలోమీటర్లు ట్రై సైకిల్ యాత్ర పూర్తి చేసినట్లు ఇంకా తిరుమల చేరుకోవడానికి 330కిలోమీటర్లు మేర యాత్ర మిగిలివుందని అన్నారు.
Andhra Pradesh
TDP
Chandrababu Naidu
Tirumala
Tirupati
Srikakulam
Tricycle Yatra
Differently Abled
మొహమ్మద్ నసీర్
ఆంధ్రప్రదేశ్
రాజకీయ వార్తలు
Scroll for the next article