News8th Oct 06:26 PMSunil Byrisetty1 min read
సమాచారాన్ని చేరవేసేందుకు డిజిటల్ యాప్
ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందించేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన సమీకృత మొబైల్, వెబ్ అప్లికేషన్‌ను ఆ శాఖ మంత్రి కొలుసు పార
ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందించేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన సమీకృత మొబైల్, వెబ్ అప్లికేషన్‌ను ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ప్రారంభించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు సమాచారాన్ని స్వీకరించే విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా, డిజిటల్, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అందించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలకు చేరవేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రభుత్వం, మీడియా, ప్రజల మధ్య మరింత బలమైన డిజిటల్ వారధిగా ఈ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
మాన్యువల్ ప్రక్రియలను డిజిటల్ విధానంలోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం ప్రజలతో మరింత అనుసంధానం కావడానికి ఈ యాప్ దోహదపడుతుందని మంత్రి తెలిపారు. యాప్ రూపకల్పన, వినియోగంలోకి తీసుకురావడనికి కృషి చేసిన శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ ను ప్రత్యేకంగా అభినందించారు. పత్రికా ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా, అవుట్‌డోర్ మీడియా, ఫ్యాక్ట్ చెక్, కేడర్ మేనేజ్‌మెంట్ తదితర విభాగల సమాచారాన్ని సమీకరించి ఈ డిజిటల్ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.