Entertainment17th Nov 01:28 PMSunil Byrisetty1 min read

నాగార్జున కుటుంబంపై సైబర్ దాడి!

అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడ్డారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు గురించి నాగార్జున స్వయంగా బయటపెట్టారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వి

నాగార్జున కుటుంబంపై సైబర్ దాడి!
అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడ్డారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ట్రాప్ చేసిన కేటుగాళ్లు గురించి నాగార్జున స్వయంగా బయటపెట్టారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వివరాలను వెల్లడించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. నటులు చిరంజీవి నాగార్జున, నిర్మాత దిల్ రాజు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున.. తన కుటుంబం కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడిందని వెల్లడించారు. తన కుటుంబంలో ఒకరిని డిజిటల్ అరెస్ట్ పేరుతో కేటుగాళ్లు ఇబ్బందికి గురిచేసినట్లు తెలిపారు. పోలీసుల సహకారంతో దాని నుంచి బయటపడినట్లు చెప్పారు.
Telangana news
Akkineni Nagarjuna
Nagarjuna family
cyber attack
digital arrest scam
cyber criminals
Hyderabad Police
CP Sajjanar
సినీ ప్రముఖులు
చిరంజీవి
దిల్ రాజు
సురేష్ బాబు
ఐబొమ్మ కేసు
సైబర్ క్రైమ్‌
Scroll for the next article