News23rd Dec 11:22 AMSunil Byrisetty1 min read

సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం ఫోరెన్సిక్

సైబర్ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు సైబర్ భద్రత డిజిటల్ ఫోరెన్సిక్ ప్రయోగశాల ఎంతగానో దోహదపడుతుందని, విద్యార్థులు బాగా శిక్షణ పొంది ఆ దిశగా ప్రజలందరికీ అవగాహన కలిగించాలని శాసనసభ

సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం ఫోరెన్సిక్
సైబర్ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు సైబర్ భద్రత డిజిటల్ ఫోరెన్సిక్ ప్రయోగశాల ఎంతగానో దోహదపడుతుందని, విద్యార్థులు బాగా శిక్షణ పొంది ఆ దిశగా ప్రజలందరికీ అవగాహన కలిగించాలని శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. విజయవాడ కానూరులో కాకినాడ సి పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి కెవి రావు అందించిన 1.36 కోట్ల రూపాయల విరాళంతో కెవి రావు పేరిట ఏర్పాటు చేసిన సైబర్ భద్రత డిజిటల్ ఫోరెన్సిక్ ప్రయోగశాలను అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజుతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆ ప్రయోగశాల సైబర్ నేరాలను ఎలా పసిగట్టి నియంత్రిస్తుందో వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ నేరాలు దోపిడీ కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని అరికట్టేందుకు సైబర్ భద్రత డిజిటల్ ఫోరెన్సిక్ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మన సెల్ ఫోన్ లకు నేరస్తులు సందేశాలు పంపుతుంటారని పొరపాటున దాన్ని క్లిక్ చేస్తే మనకు తెలియకుండానే మన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మాయమైపోతున్నాయన్నారు.
Cyber Security
Digital Forensics
Cyber Crimes
Chintakayala Ayyannapatrudu
Vijayawada
Kanuru
KV Rao
అవగాహన కార్యక్రమాలు
బ్యాంకింగ్ మోసాలు
సాంకేతిక పరిజ్ఞానం
Scroll for the next article