Crime2nd Aug 02:04 PMSunil Byrisetty1 min read

సైబర్ మోసాలతో రూ.22,842 కోట్లు దోపిడీ

దేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సైబర్‌ నేరగాళ్లు విచ్చలవిడిగా దోచేశారు. రూ.22,842 కోట్ల సొమ్మును సైబర్ మోసాలతో కొల్లగొట్టారు. ఢిల్లీకి చెందిన 'డేటా ల్యాబ్స్‌' విడుదల చేసిన నివేదిక

సైబర్ మోసాలతో రూ.22,842 కోట్లు దోపిడీ
దేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సైబర్‌ నేరగాళ్లు విచ్చలవిడిగా దోచేశారు. రూ.22,842 కోట్ల సొమ్మును సైబర్ మోసాలతో కొల్లగొట్టారు. ఢిల్లీకి చెందిన 'డేటా ల్యాబ్స్‌' విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ దోపిడీ 8 రెట్లు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆర్ఠిక సంవత్సరంలో సైబర్‌ నేరాల బారినపడి సుమారు రూ.1.2 లక్షల కోట్లు కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. 2022లో రూ.2,306 కోట్లు, 2023లో రూ.7,465 కోట్లు దోచేసినట్లు వెల్లడించింది. సైబర్‌ నేరాలకు సంబంధించి 2023లో 15.6 లక్షల ఫిర్యాదులు రాగా, 2024లో 20 లక్షల వరకు ఫిర్యాదులు అందాయని వివరించింది. ఓటీపీ మోసాల నుంచి డిజిటల్‌ అరెస్ట్‌ దాకా కొత్త కొత్త విధానాల్లో ప్రజల నుంచి సొమ్ము కొట్టేస్తున్నారు.
India news
Cybercrime India 2024
Cyber Fraud Report
₹22
842 Crore Loss
Digital Scams
OTP Fraud
Data Labs Report
Cyber security
Financial Crime India
Digital Arrest Scam
Online Fraud Complaints
Scroll for the next article