News2nd Jul 05:25 PMSunil Byrisetty1 min read

మెప్మాలో డిజిటల్ విధానంలో పౌర సేవలు

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు త్వరితగతిన సేవలు అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) లో డిజిటల్ విధానానికి శ్రీకారం చుట

మెప్మాలో డిజిటల్ విధానంలో పౌర సేవలు
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు త్వరితగతిన సేవలు అందించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) లో డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు మంత్రి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. దుర్గేష్ మాట్లాడుతూ రిసోర్స్ పర్సన్స్‌కు పనిభారం, సమయాభావం తగ్గించాలనే ఉద్దేశంతో ట్యాబులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. పౌరులు తమకు కావాల్సిన మున్సిపల్, ఇతరత్రా సేవలను అడిగితే త్వరితగతిన అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. మెప్మా, డ్వాక్రాలు సీఎం చంద్రబాబు మానస పుత్రికలు అని అభివర్ణించారు. మహిళల సంక్షేమానికి, సాధికారతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ డిజిటల్ విధానంతో మెప్మాలో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయని పేర్కొన్నారు.
Andhra Pradesh news
Cm chandra babu
Minister Kandula Durgesh
digital services
mepma
డిజిటల్ విధానంతో మెప్మాలో సేవలు
Scroll for the next article