News22nd Sep 03:01 PMSunil Byrisetty1 min read

పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్

పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు

పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్
పాలనలో డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అత్యంత ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సాంకేతికతతోనే ప్రజలకు పాలను మరింత చేరువ చేసే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ ఈ-గవర్నెన్సు సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సివిల్ సర్సీసెస్ -డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ థీమ్ తో జరుగుతున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్సు సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవలను మరింత సమర్ధంగా నిర్వహించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికత కీలకమని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ - గవర్నెన్సు అంశాలతో పాలనలో మార్పులు వచ్చాయని ముఖ్యమంత్రి అన్నారు. కమ్యూనికేషన్ సంస్కరణల ద్వారా ప్రజా జీవనంలోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గతంలోనే ఉమ్మడి ఏపీలో ఈ-సేవ, మీ-సేవ ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని సీఎం అన్నారు. ఈ-ఫైల్స్, ఈ-కేబినెట్ లాంటి అంశాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు. అలాగే ఈ వ్యవస్థలను అమలు చేసే సమయంలో సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఐటీతో వచ్చిన విస్తృత ప్రయోజనాలను అందిపుచ్చు కోగలుగుతున్నామని అన్నారు. ఈ ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మనమిత్ర వాట్సప్ గవర్నెన్సును అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. మొత్తం 751 పౌరసేవల్ని వాట్సప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకూ తీసుకెళ్లామని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Digital Transformation
Governance
Chandrababu Naidu
E-Governance
AI in Governance
Cyber Security
Public Services
Citizen Services
ఈ-సేవ
మీ-సేవ
ఈ-ఫైల్స్
ఈ-కేబినెట్
వాట్సాప్ గవర్నెన్సు
Scroll for the next article