News10th Nov 11:39 AMSunil Byrisetty1 min read

ఇకపై నేరుగా డ్రైవింగ్ లైసెన్స్!

ఇకపై నేరుగా లైసెన్స్ పొందేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల (RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదార

ఇకపై నేరుగా డ్రైవింగ్ లైసెన్స్!
ఇకపై నేరుగా లైసెన్స్ పొందేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు (DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల (RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున DTCలను పెట్టనుండగా RDTCలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ఏర్పాటు చేయనుంది. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు. దీని వల్ల వాహనదారులు ఎదురుచూసే అవస్థలు తప్పుతాయి. లైసెన్స్ పొందే ప్రక్రియ వేగం కానుంది.
Andhra Pradesh
Driving License
Transport Department
DTC
RDTC
AP Government
Vehicle Training
License Process
రోడ్డు భద్రత
వాహనదారుల సౌకర్యం
ప్రభుత్వ నిర్ణయం
Scroll for the next article