Entertainment24th Oct 05:54 PMSunil Byrisetty1 min read

హాలీవుడ్లో రాజమౌళి సినిమా

ప్రపంచవ్యాప్త సంచలనం సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత తనకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయని, అక్కడ కనీసం ఒక్క చిత్రానికైనా దర్శకత్వం వహించాలన్నది తన ఆకాంక్ష అని దర్శకుడు ఎస్.ఎస్.

హాలీవుడ్లో రాజమౌళి సినిమా
ప్రపంచవ్యాప్త సంచలనం సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత తనకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయని, అక్కడ కనీసం ఒక్క చిత్రానికైనా దర్శకత్వం వహించాలన్నది తన ఆకాంక్ష అని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వెల్లడించారు. బ్రెజిల్‌లో నిర్వహించిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “హాలీవుడ్ నుంచి నాకు అనేక ఆఫర్లు వచ్చాయి. వారి పనితీరు, నిర్మాణ శైలి అత్యద్భుతంగా ఉంటాయి. అక్కడ నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, అందుకే అక్కడ కనీసం ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటున్నాను” అని రాజమౌళి వివరించారు. తాను ఎప్పుడూ ఒకేసారి ఒక్క సినిమాపైనే దృష్టి సారిస్తానని, ఏకకాలంలో బహుళ ప్రాజెక్టులు చేపట్టే అలవాటు తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.
Scroll for the next article