News26th Aug 11:38 AMSunil Byrisetty1 min read

తాత్కాలిక సదరం ఉన్నా పెన్షన్ కంటిన్యూ

ఏపీలో వికలాంగుల పెన్షన్ పై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. 40% పైబడి వికలాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 40%, అ

తాత్కాలిక సదరం ఉన్నా పెన్షన్ కంటిన్యూ
ఏపీలో వికలాంగుల పెన్షన్ పై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. 40% పైబడి వికలాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 40%, అంతకంటే ఎక్కువ శాతం వికలాంగత ఉన్న వారికి తాత్కాలిక సదరం సర్టిఫికెట్ ఉన్నా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సమాఖ్య (SERP) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అనర్హులపై జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు చేశారు.
AP Disabled Pension
NTR Bharosa Pension
Andhra Pradesh Government Schemes
Disability Certificate
Temporary Certificate Pension
AP SERP Orders
Vakati Karuna
సదరం ఉన్నా వికలాంగుల పెన్షన్
వికలాంగుల సర్టిఫికేట్
Scroll for the next article