Politics1st May 06:08 PMSunil Byrisetty1 min read
ప్రమాదాలు.. ఎవరి హయాంలో ఎన్నంటే!
ఏపీలో విపత్తులు, ప్రమాదాలపై చర్చ నడుస్తోంది. జగన్ హయాంలో ఇన్ని అంటే, బాబు హయాంలో ఎక్కువంటూ వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగాయో చూద్దాం. ఇటీవల సింహాచలంలో
ఏపీలో విపత్తులు, ప్రమాదాలపై చర్చ నడుస్తోంది.
జగన్ హయాంలో ఇన్ని అంటే, బాబు హయాంలో ఎక్కువంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
వాస్తవంగా ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగాయో చూద్దాం.
ఇటీవల సింహాచలంలో గోడ కూలి 8 మంది మరణించడంతో ఈ వాదన జరుగుతోంది.
జగన్ ప్రభుత్వంలో కచ్చలూరు బోటు ప్రమాదంలో 47 మంది మృత్యువాత పడ్డారు.
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 37మంది, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది, తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది, విశాఖలో క్రేన్ కుప్పకూలి 11 మంది, బెజవాడ కొవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదంలో 10 మంది, ఏలూరు జిల్లా పోరస్ కెమికల్స్ లో అగ్ని ప్రమాదంతో 6 గురు, ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ త్రాగి 13 మంది, జంగారెడ్డి గూడెంలో నాటు సారా తాగి 46 మంది మృతి చెందారు.
అదే 2014- 19, ఇప్పుడు కూటమి ప్రభుత్వాల్లో గోదావరి పుష్కరాల్లో 29 మంది, గుంటూరు సభలో ముగ్గురు, కందుకూరు సభలో 8 మంది, ఇటీవల తిరుపతిలో తొక్కిసలాటలో 8 మంది, బుడమేరు వరద, రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల 32 మంది మృత్యువాత పడ్డారు. ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రమాదాలు, విపత్తులు సంభవిస్తుంటాయి.
వాటికి పార్టీలు, ప్రభుత్వాలకు ఆపాదించడం, విమర్శలు చేసుకోవడం అలవాటుగా మారింది.