Health5th Sep 11:36 AMSunil Byrisetty1 min read

కేంద్ర అత్యవసర మందుల జాబితా ముసాయిదాపై చర్చ

సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆధ్యక్షతన తాడేపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో భారత ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం జారీ చేసిన EML (అవసర/అత్యవసర మందులు వివరాలు) ధృవీకరణ కోస

కేంద్ర అత్యవసర మందుల జాబితా  ముసాయిదాపై చర్చ
సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆధ్యక్షతన తాడేపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో భారత ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం జారీ చేసిన EML (అవసర/అత్యవసర మందులు వివరాలు) ధృవీకరణ కోసం ముసాయిదా ప్రతిపాదనపై ఉన్నత స్థాయి చర్చ జరిగిoది. ఈ సమావేశoలో జాయింట్ కమిషనర్, ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్, ఎపిఎంఎస్ ఐడిసి జనరల్ మేనేజర్, సెకండరీ ఆసుపత్రులకు చెందిన వివిధ స్పెషలిస్ట్ వైద్యులు, ఫార్మసీ విభాగ అధికారులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన సుమారు 297 రకాల మందుల అవసరo గురించి వివరంగా చర్చించారు. దీనిపై వారి వారి అభిప్రాయాలు తెలిపారు. 50 కొత్త రకాల ఔషధాల జాబితా కూడా అవసరమని గుర్తించి భారత ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంపై కూడా చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సిరి మాట్లాడుతూ రోగులకు అవసరమైన మందులు పంపిణీ చేస్తామని, వైద్యులు ఇస్తున్న రకరకాలైన యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధకత తగ్గుతుందని, వాటి వాడకాన్ని నియంత్రించాలని అధికారులకు డాక్టర్ సిరి ఆదేశించారు.
India
Essential Medicines
EML
Public Health
Drug Regulation
Pharmacy
Healthcare Policy
Antibiotics
Secondary Health
Government Health Initiative
కొత్త ఔషధాలు
ఆరోగ్య కార్యక్రమాలు
ప్రభుత్వ నివేదిక
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్
Scroll for the next article