News19th Jan 11:54 AMSunil Byrisetty1 min read
అసెంబ్లీకి 60 రోజులు గైర్హాజరైతే అనర్హతే!
ఫిబ్రవరి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు పార్టీలకు అతీతమని స్పష్టం చేశ
ఫిబ్రవరి 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. నిబంధనల ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు పార్టీలకు అతీతమని స్పష్టం చేశారు. సభకు రాకుండా సంతకాలు పెట్టే సభ్యులపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుగుతోందని, 60 రోజులు వరుసగా గైర్హాజరైతే అనర్హత తప్పదని హెచ్చరించారు. మండలికి వచ్చి అసెంబ్లీకి రాకపోవడం సరికాదని, ఈ సమావేశాలకైనా జగన్‌తో సహా వైసీపీ సభ్యులు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాను పార్టీ సమావేశాలకు హాజరు కాలేదని పేర్కొంటూ, నియమాలు తెలియక కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.