News26th Aug 02:24 PMSunil Byrisetty1 min read

సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తరపున వారి పే

సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తరపున వారి పేషీ అధికారులు, సిబ్బంది మట్టితో తయారు చేసిన అంకుర గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ అంకుల గణపతి ప్రతిమలలో ఒక విశిష్టిత ఉందని, గణపతి పూజ అనంతరం ఈ విగ్రహాన్ని నీటితో తడిపి నానబెడితే అందులో నుండి మొక్క వస్తుందని తద్వారా పచ్చదనం పరిఢవిల్లుతుందని చెబుతున్నారు. రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆద్వర్యంలో సచివాలయ ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ తద్వారా ప్లాస్టర్ ఆప్ పారిస్, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
Andhra Pradesh
Ganesh Chaturthi
Clay Idols
Eco-friendly Celebration
Secretariat
Environmental Protection
Pollution Control
Green Initiative
Velagapudi
సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
వినాయక చవితి
Scroll for the next article