News26th Jul 10:54 AMSunil Byrisetty1 min read
బాలికలకు నిత్యవసరాలు పంపిణీ
కాజ టోల్గేట్ వద్ద ఎస్కేసీవీ చిల్డ్రన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఆమోదిని గర్ల్స్ హోమ్ లో అనంతపురం జిల్లా, నేలకోట తండాకు చెందిన గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, మ
కాజ టోల్గేట్ వద్ద ఎస్కేసీవీ చిల్డ్రన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఆమోదిని గర్ల్స్ హోమ్ లో అనంతపురం జిల్లా, నేలకోట తండాకు చెందిన గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శంకర్ షాలిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి బాలికలకు నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు భూక్యా షాలిని చేతుల మీదుగా బాలికలకు నిత్యవసరాలను అందజేశారు. శంకర్ నాయక్, గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్యలను స్థాపించి చదువు, సమీకరించు, సాధించు అనే నినాదంతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో నాయక్ గిరిజనుల అభివృద్ధికి మరింత కృషి చేస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.