News18th Nov 04:41 PMSunil Byrisetty1 min read

వికలాంగులకు వినికిడి యంత్రాలను పంపిణీ

వినికిడి యంత్రాల పరికరాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అందజేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్

వికలాంగులకు వినికిడి యంత్రాలను పంపిణీ
వినికిడి యంత్రాల పరికరాలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అందజేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి దీన్ దయాళ్ శ్రావణ ఫౌండేషన్, నేషనల్ హెల్త్ మిషన్ ఆర్ బి ఎస్ కే, ఎన్ పి పి సి డి, ఎన్ సి డి ద్వారా వికలాంగులకు వినికిడి యంత్రాలను పంపిణీ చేయడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ రేపటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వికలాంగుల కోసం 8 క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచితంగా పరికరాలను పొందాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలు వీల్ చైర్స్ వంటి పరికరాలను వారికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పరికరాలన్నీ విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజులలో అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో ఎవరికీ తక్కువ కాదని వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
Andhra Pradesh
Chittoor
Disability Support
Hearing Aids Distribution
Sumit Kumar
District Collector
Assistive Devices
National Health Mission
RBSK
NPPCD
NCD
Deen Dayal Shravan Foundation
Welfare Camps
Government Welfare Schemes
Disabled Persons
Accessibility Programs
Scroll for the next article