News10th Mar 10:37 AMSunil Byrisetty1 min read

పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

రంజాన్ పండుగ సందర్భంగా హల్ ఎహ్ సాన్ ఫౌండేషన్ విజయవాడ వారి సహకారంతో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం బసవతారకనగర్ లో ఫౌ

పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ
రంజాన్ పండుగ సందర్భంగా హల్ ఎహ్ సాన్ ఫౌండేషన్ విజయవాడ వారి సహకారంతో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం బసవతారకనగర్ లో ఫౌండేషన్ కన్వీనర్ మొహమ్మద్ బకియతుల్లా ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 15 కిలోల బియ్యం, రెండు కేజీల పచ్చి శనగ పప్పు, కేజీ చింతపండు, కేజీ పంచదార, రెండు లీటర్ల నూనె, అరకేజీ కారం, 200 గ్రాముల పసుపు, 200 గ్రాముల డాల్డా ప్యాకెట్ ను పంపిణీ చేశారు. హల్ ఎహ్ సాన్ ఫౌండేషన్ కన్వీనర్ మొహమ్మద్ బకియతుల్లా మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రంజాన్ పర్వదినం సందర్భంగా యర్రబాలెం బసవతారక నగర్ కు చెందిన 15 నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మస్జీద్ కమిటీ ప్రతినిధులు నాగరాజు నాయుడు(ఇస్మాయిల్), షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Mohammad Bakiyatullah
Ramadan
Muslim's
హల్ ఎహ్ సాన్ ఫౌండేషన్
మొహమ్మద్ బాకీయతుల్లాహ్
Scroll for the next article