Spiritual21st Sep 11:52 AMSunil Byrisetty1 min read
ఉచిత క్యూ లైన్లోనే ధ్వజస్తంభాన్ని చూడొచ్చు
దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జేసీ ఇలక్కియ, ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి గుడి వరకు ఉన్న క్యూలైన్లలో కాలినడకన
దసరా శరన్నవరాత్రుల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జేసీ ఇలక్కియ, ముఖ్య అధికారులతో కలిసి పరిశీలించారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి గుడి వరకు ఉన్న క్యూలైన్లలో కాలినడకన వెళ్లి అణువణువునా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిగిలిన క్యూలైన్లతో పోల్చితే ఉచిత క్యూలైన్ దర్శనంతో ఆలయ గోపురాలను, ధ్వజస్తంభాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉచిత క్యూ లైన్లో పరిసరాలను చక్కగా పరిశీలించవచ్చని, కృష్ణమ్మ అందాలనూ వీక్షించవచ్చని అన్నారు. సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.