News22nd Dec 12:08 PMSunil Byrisetty1 min read
రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమస్థానం
రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమస్థానం కల్పించడం జరిగిందని సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జ్యుడిషియల్ అకాడమీలో
రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమస్థానం కల్పించడం జరిగిందని సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించిన "రాజ్యాంగ దృక్కోణం - జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర" అనే సెమినార్ లో కీలక ఉపన్యాసం చేశారు. ప్రపంచంలోనే భారత న్యాయ వ్యవస్థ అతి పెద్దదన్నారు. అనేక దేశాల రాజ్యాంగాల కంటే ఉత్తమ లక్షణాలను కలిగి ఉందన్నారు. న్యాయ వ్యవస్థలో ప్రతి అంశంలో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా, స్థైర్యంగా ఉండాలని సూచించారు. రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమ స్థానం కల్పించడం జరిగిందన్నారు. ఉత్తమ న్యాయం అందించడమే న్యాయ వ్యవస్థ ప్రధాన విధిగా గుర్తించాలని సూచించారు. సామాన్యునికి న్యాయం చేరువ కావడానికి న్యాయ వ్యవస్థ పనితీరు మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. న్యాయ స్థానంలో జరిగే విచారణ సామాన్యునికి సైతం అర్ధం కావాలని, అప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని చెప్పారు.