News12th Oct 04:15 PMSunil Byrisetty1 min read

రైల్లో బాణసంచా తీసుకెళ్తే జైలుకే!

దీపావళి సమీపిస్తున్న తరుణంలో బాణసంచా విక్రయాలు మొదలవుతున్నాయి. దుకాణాలు పెట్టాలనుకునే వారు పొరపాటున రైల్లో బాణాసంచా తీసుకువెళ్లారా జైలు పాలయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే రైళ్లలో పేలుడ

రైల్లో బాణసంచా తీసుకెళ్తే జైలుకే!
దీపావళి సమీపిస్తున్న తరుణంలో బాణసంచా విక్రయాలు మొదలవుతున్నాయి. దుకాణాలు పెట్టాలనుకునే వారు పొరపాటున రైల్లో బాణాసంచా తీసుకువెళ్లారా జైలు పాలయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే రైళ్లలో పేలుడు పదార్థాలు, బాణసంచా తీసుకెళ్లటంపై నిషేధం ఉంది. రైళ్లలో బాణసంచా తీసుకెళ్లే సమయంలో చిన్న నిప్పు రవ్వ పడినా రైలు మొత్తం దగ్ధమయ్యే అవకాశం ఉంది. భారీ నష్టంతో పాటు వందల మంది ప్రయాణికుల ప్రాణాల ముప్పు కలిగిస్తుంది. అందుకే దీపావళి వేళ రైల్వే భద్రత విభాగం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.1000 జరిమానా, 3ఏళ్ల జైలు శిక్ష లేకుంటే ఈ రెండు కూడా విధించవచ్చని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి.
Indian Railways
Diwali
firecrackers ban
railway safety
festive season alert
explosives restriction
passenger safety
train travel rules
penalty and jail
రైల్వే హెచ్చరిక
దీపావళి బాణసంచా
ప్రజల భద్రత
రైల్వే చట్టాలు
Scroll for the next article