News20th Oct 04:15 PMSunil Byrisetty1 min read
అమ్మ వృద్ధాశ్రమంలో దీపావళి సంబరాలు
మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు గంజి చిరంజీవి, కంకణాల శంకర్ ఆధ్వర్యంలో మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం లోని అమ్మ వృద్ధాశ్రమంలో, అదే విధంగా కాజ ఆమోదిని బాలికల ఆశ
మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు గంజి చిరంజీవి, కంకణాల శంకర్ ఆధ్వర్యంలో మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం లోని అమ్మ వృద్ధాశ్రమంలో, అదే విధంగా కాజ ఆమోదిని బాలికల ఆశ్రమంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాజ ఆమోదిని బాలికల ఆశ్రమంలో బాలికలకు స్వీట్లు, క్రాకర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గంజి చిరంజీవి మాట్లాడుతూ.. ఆనందాలను, వెలుగును పంచే పండుగ దీపావళి అని, పెద్దలతో, చిన్నారులతో దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. జనసేన నాయకులు కంకణాల శంకర్ మాట్లాడుతూ ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, నాయకులకు, కార్యకర్తలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పర్వదినం మనందరి జీవితాల్లో ఆనందాలు నింపి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను వృద్ధాశ్రమం, బాలికల ఆశ్రమంలో జరుపుకున్నందుకు సంతోషంగా ఉందని, బాలికలకు స్వీట్లు, క్రాకర్స్ పంపిణీ చేయడం మరెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చెన్నం వీరాంజనేయులు, బోనం రామారావు తదితరులు పాల్గొన్నారు.