News19th Oct 09:04 AMSunil Byrisetty1 min read
పోలవరం నిర్వాసితులకు దీపావళి శుభవార్త
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత సంక్రాంతికి ప్రభుత్వం రూ. 1000 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీపావళి సందర్భంగా రూ. 1100 కోట్లు విడుదల
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత సంక్రాంతికి ప్రభుత్వం రూ. 1000 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీపావళి సందర్భంగా రూ. 1100 కోట్లు విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా కలిపి ఇప్పటి వరకు పునరావాసానికి రూ. 2,100 కోట్లను విడుదల చేసింది. అదే విధంగా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 16 నెలల్లోనే రూ. 12,157 కోట్లు సాధించింది. ఈ నిధులతో ముంపు ప్రాంతవాసుల పునరావాసంతోపాటు, ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం కానుంది.