Politics29th Nov 01:49 PMSunil Byrisetty1 min read

కర్ణాటకలో సీఎం వార్.. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

ముఖ్యమంత్రి పదవి విషయంలో కర్ణాటకలో గందరగోళం నెలకొన్న సమయంలో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం సిద్ధరామయ్య, డెప్యూటీ సీఎం డీకే

కర్ణాటకలో సీఎం వార్.. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
ముఖ్యమంత్రి పదవి విషయంలో కర్ణాటకలో గందరగోళం నెలకొన్న సమయంలో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం సిద్ధరామయ్య, డెప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో కూర్చున్నారు. ఈ సమావేశం తర్వాత ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రేపటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి గందరగోళం ఉండదని చెప్పారు. పార్టీ కోసం కలిసి పనిచేస్తామని ఆయన వివరించారు. పార్టీలో నేతలంతా ఐకమత్యంతో ఉన్నారని, ఇకపైనా ఇదే ఐకమత్యం కొనసాగుతుందని చెప్పారు. డీకే మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్యకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామిద్దరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాము నమ్మకమైన సేవకులమని చెప్పారు.
Karnataka Politics
CM Post War
Congress High Command
Siddaramaiah
DK Shivakumar
Breakfast Meeting
Political Crisis
Congress Leadership
Media Briefing
Unity in Congress
Karnataka Government
Political Developments
Scroll for the next article