Spiritual17th Dec 05:36 PMSunil Byrisetty1 min read
సింహాచలం దేవస్థానం భూములు ఇవ్వవద్దు
రాష్ట్ర అభివృద్ధికి విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకంకాదని అయితే, అభివృద్ధి పేరుతో ఆలయ భూములను పంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పరిషత్ అధ్యక్షుడు ఆచార్య కందర్ప విశ్వనాథ్ పేర్కొన్నారు
రాష్ట్ర అభివృద్ధికి విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకంకాదని అయితే, అభివృద్ధి పేరుతో ఆలయ భూములను పంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పరిషత్ అధ్యక్షుడు ఆచార్య కందర్ప విశ్వనాథ్ పేర్కొన్నారు. విశాఖపట్నం ముడసర్లోవ పార్క్ ఎదురు జైలు పక్కన ఉన్న సింహాచలం అప్పన్న దేవాలయానికి చెందిన సుమారు 150 ఎకరాల భూమిని అభివృద్ధి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థకు కేటాయించడానికి జీ వో విడదల చేయడం అభ్యంతరకరమని ఆయన బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆలయ భూముల కేటాయింపును విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, అభివృద్ధి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆలయ భూముల జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానాలతో పాటు దేశ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో దేవాలయాల ఆస్థులు, దేవాలయాల అభివృద్ధికితప్ప ఇతర అవసరాలకు వాడకూడదని అనేక తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు.