News8th Sep 12:14 PMSunil Byrisetty1 min read
ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి
కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిగొద్దని హోంమంత్రి అనిత సూచించారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. ఈ మేరకు మంత్
కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రలోభాలకు లోనై ఆందోళనలకు దిగొద్దని హోంమంత్రి అనిత సూచించారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. ఈ మేరకు మంత్రి ఒక వీడియో విడుదల చేశారు.
ప్రతిఏటా జాబ్ క్యాలెండర్‌లో 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2014-19 మధ్య 9,793 పోలీసు పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. జగన్ హయాంలో ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. నోటిఫికేషన్ ఇచ్చి 6 వేల పోలీసు పోస్టులను జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందని అనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6 వేల పోస్టుల సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలతో భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.