News22nd Oct 04:23 PMSunil Byrisetty1 min read
శాకాహార గ్రామం ఎక్కడుందో తెలుసా?
భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, వింతైనా గ్రామాలు ఉన్నాయి. అలాంటి వింతైన గ్రామం గుజారాత్ లో ఉంది. ఇది పూర్తి శాకాహార గ్రామం. గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ జిల్లాలో కొలువుదీరిన పా
భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, వింతైనా గ్రామాలు ఉన్నాయి. అలాంటి వింతైన గ్రామం గుజారాత్ లో ఉంది. ఇది పూర్తి శాకాహార గ్రామం. గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ జిల్లాలో కొలువుదీరిన పాలిటానా గ్రామం పూర్తి వెజిటేరియన్ విలేజ్ గా పేరు తెచ్చుకుంది.ఈ గ్రామం శత్రుంజయ కొండల కింద ఉంది. ఈ ప్రాంతం జైన మతస్థులకు పరమ పవిత్రమైన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ కొండపై దాదాపు తొమ్మిది వందలకు పైగా పాలరాతి దేవాలయాలు అద్భుత శిల్పకళతో దర్శనమిస్తాయి. ఈ నేల ఆధ్యాత్మిక భావనలు, అహింసా సిద్ధాంతాలకు నిలయంగా మారింది. ప్రపంచంలోనే మాంసాహారాన్ని, జంతువధను అధికారికంగా చట్టబద్ధంగా పూర్తిగా నిషేధించిన మొదటి సంపూర్ణ శాకాహార ప్రాంతంగా ఈ పట్టణం చరిత్ర సృష్టించింది.