News25th Oct 10:51 AMSunil Byrisetty1 min read
సమ్మె విరమిస్తున్నాం
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నుంచి దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారంపై నిర్దిష్టమైన హామీలు లభించినందున నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు వైద్య సంఘాల నేతలు వెల్లడించారు. పీజీ
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నుంచి దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారంపై నిర్దిష్టమైన హామీలు లభించినందున నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు వైద్య సంఘాల నేతలు వెల్లడించారు. పీజీ మెడికల్ ఇన్-సర్వీస్ కోటా కొనసాగింపు, ఉద్యోగ సర్వీసు వ్యవహారాలపై సానుకూల ఉత్తర్వుల కోసం గతనెల 28 నుంచి ఆందోళనలు చేపట్టారు. ఈ నెల 3 నుంచి నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ను పీహెచ్సీ వైద్యుల సంఘం, ఏపీవీవీపీ వైద్యుల సంఘం (జేఏసీ) నేతలు రవీంద్రనాయక్, వినోద్, కిషోర్, రోహిత్, జయప్రకాష్, వివేక్, అజయ్, ఇతరులు కలిసి, అపరిష్కృత డిమాండ్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. చర్చల అనంతరం మంత్రి సత్యకుమార్ 2025-26 విద్యా సంవత్సరంలో పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారు.