News13th Aug 05:10 PMSunil Byrisetty1 min read
జూడాల సమ్మెకు వైద్యుల సంఘీభావం
జూనియర్ వైద్యుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న సమ్మెకు వైద్యుల సంఘం జీడీఏఏపీ అధ్యక్షుడు డా. ఐ. బాబ్జీ శ్యామ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మె శిబిరాన్ని
జూనియర్ వైద్యుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న సమ్మెకు వైద్యుల సంఘం జీడీఏఏపీ అధ్యక్షుడు డా. ఐ. బాబ్జీ శ్యామ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన జూనియర్ వైద్యుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జూనియర్ వైద్యుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని డా. బాబ్జీ శ్యామ్‌కుమార్ తెలిపారు. న్యాయమైన డిమాండ్ల కోసం వారు చేపట్టిన శాంతియుత, ప్రజాస్వామ్య పోరాటానికి వైద్య సమాజం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సమ్మె శిబిరానికి స్వయంగా హాజరై మద్దతు ప్రకటించడం ద్వారా వైద్యుల మధ్య ఉన్న ఐక్యత, పరస్పర సహకారం మరోసారి వెల్లడైందని జూనియర్ వైద్యులు పేర్కొన్నారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, ఉద్యమానికి మద్దతుగా నిలిచిన డా. బాబ్జీ శ్యామ్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.