News4th Apr 11:27 AMSunil Byrisetty1 min read

కొడాలి నాని సర్జరీ సక్సెస్.. నెల రోజులు!

ఫైర్ బ్రాండ్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని)కు ముంబయిలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్లో ఈ నెల 2న నిర్వహిం చిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు వైకాపా జిల్ల

కొడాలి నాని సర్జరీ సక్సెస్.. నెల రోజులు!
ఫైర్ బ్రాండ్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని)కు ముంబయిలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్లో ఈ నెల 2న నిర్వహిం చిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హను మంతరావు తెలిపారు. "ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే సుమారు 8 నుంచి 10 గంటల పాటు శస్త్ర చికిత్స చేశారు. కొన్ని రోజులపాటు నాని.. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆయన అవయవా లన్నీ బాగా స్పందిస్తున్నాయని వైద్యులు ధ్రువీకరించారు. మరో నెల రోజులపాటు నాని ముంబయిలోనే ఉంటారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాం" అని పేర్కొన్నారు.
Heart surgery
Kodali nani
health condition
మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వర రావు నాని
ముంబయి
హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్
Scroll for the next article