Politics15th Jun 11:04 AMSunil Byrisetty1 min read

ఈయన గుర్తున్నారా?

గత ప్రభుత్వంలో ప్రశ్నించిన పాపానికి పలువురు బలైపోయారు. ఏకంగా సంవత్సరం పాటు పోలీస్ స్టేషన్ కు విచారణ పాటు పొద్దున్నే 6.30 కి పిలిచి రాత్రి 11 గంటలకు వదిలేవారు. కరోనా ఉధృతంగా ఉన్న సమ

ఈయన గుర్తున్నారా?
గత ప్రభుత్వంలో ప్రశ్నించిన పాపానికి పలువురు బలైపోయారు. ఏకంగా సంవత్సరం పాటు పోలీస్ స్టేషన్ కు విచారణ పాటు పొద్దున్నే 6.30 కి పిలిచి రాత్రి 11 గంటలకు వదిలేవారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో విశాఖపట్నంలో అరెస్ట్ చేసి కర్నూలు తరలించారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కరోనా వార్డులో పేషెంట్ల మధ్య ఏ మాస్కూ లేకుండా పెట్టారు. రాత్రి తెల్లవార్లూ ఆ వార్డులో పెట్టి పొద్దున్నే రిమాండ్ కు పెడితే జడ్జి రిమాండ్ రిజెక్ట్ చేసి విడుదల చేసారు. చివరికి పదిహేను రోజుల పాటు కరొనా పోరాడి తనువు చాలించారు. ఇది నాటి వైసీపీ సర్కారు చేసిన హత్య కాదా. పోలీసులను అడ్డు పెట్టిన రాజ్యాంగేతర శక్తులు ఆడిన ఆట కాదా? ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈ ఫోటోలోని ఆయనే ఆ బాధితుడు. ఇంకా గుర్తు రాకపోతే ఆయన విశాఖలో ప్రముఖ విద్యాసంస్థల అధిపతి నలంద కిషోర్, నాడు బలైపోయిన పెద్ద మనిషి.
Andhra Pradesh news
Ap politics
vizag
Nalanda Kishore
YSRCP government
విద్యాసంస్థల అధిపతి నలంద కిషోర్
వైసీపీ సర్కారు చేసిన హత్య
Scroll for the next article